PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాడ్పే సినిమా ఆపాలి.. ప్రధానికి సినీ వర్కర్ల లేఖ !

1 min read

పల్లెవెలుగువెబ్ : మహాత్మ గాంధీ హత్య ఇతివృత్తంగా వై ఐ కిల్ల్డ్ గాంధీ సినిమా ఆపాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ‘‘నాథూరాం గాడ్సే దేశద్రోహి. భారత జాతి పిత అయిన గాంధీని చంపిన హంతకుడు’’ అని మోదీకి రాసిన లేఖలో ఏఐసీడబ్ల్యూఏ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాలో గాడ్సే పాత్ర పోషిస్తున్న ఎంపీపై కూడా విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం ప్రకారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగేతర కార్యలపాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సినిమా విడుదలైతే జనవరి 30, 1948న జరిగిన ఘోరమైన నేరాన్ని చూసి యావత్ దేశం దిగ్భ్రాంతికి గురవుతుందని ఏఐసీడబ్ల్యూఏ సభ్యులు అన్నారు.

       

About Author