మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తారా .. అయితే ఈ అవకాశం మీకోసమే !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ షార్ట్ ఫిల్మ్ తీసేవారికి సదావకాశం కల్పిస్తోంది. టేక్ టెన్ పేరిట షార్ట్ ఫిల్మ్ వర్క్ షాప్, పోటీని నిర్వహిస్తోంది. దేశ యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. టేక్ టెన్ కు ఎంపికైన వారు వర్క్ షాప్ కు హాజరవ్వడమే కాకుండా 10వేల డాలర్లతో షార్ట్ ఫిల్మ్ రూపొందించే అవకాశం దక్కనుంది. ఇలా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ లను నెట్ ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ లో ఉంచున్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఈ పోటీకి అర్హులు. పోటీలో పాల్గొనాలంటే మై ఇండియా అంశం పై రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ రూపొందించి నెట్ ఫ్లిక్స్ కు పంపాలి. అది కూడ మొబైల్ తో తీసి పంపాలి. ఫిబ్రవరి 7 నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.