టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టు
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 గంటలు వాదోపవాదాలు జరిగిన తర్వాత వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని, డీజీపీ గౌతమ్ సవాంగ్.. సీఎం జగన్ కు తొత్తుగా పని చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా ఆరోపించారు.