PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12 కోట్లు మాయం !

1 min read

పల్లెవెలుగువెబ్ : మహేష్ కో​ ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేశారు. ఏకంగా రూ. 12 కోట్లు మాయం చేశారు. బ్యాంకు టెక్నికల్ సిబ్బంది స్పందించే లోపే జరగాల్సిన నష్టం జరిగింది. బ్యాంక్ మెయిన్ సర్వర్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. మరోవైపు మహేష్ బ్యాంక్ యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏయే ఖాతాలకు నగదు బదిలీ అయిందో వివరాలను పరిశీలిస్తున్నారు.

      

About Author