రెండున్నర ఎకరాల్లో కన్వెన్షన్ కట్టడానికి డబ్బెక్కడిది ?
1 min readపల్లెవెలుగువెబ్ : రెండున్నర ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి నానికి డబ్బు ఎలా వచ్చిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని మార్చేస్తానన్న సీఎం జగన్ చెప్పడం వల్లే పదవిని కాపాడుకునేందుకు నాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సహించబోమని, మాటకుమాట బదులిస్తామని స్పష్టం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యల పేరిటి నానితో పాటు టీడీపీ నేతలపై కేసులు పెట్టారని, బూతులు మాట్లాడుతున్న కొడాలి పై పోలీసులు కేసు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పై కొడాలి నాని వ్యాఖ్యలు సరికాదని అన్నారు.