కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లోనే మంత్రుల నుంచి ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. కొత్త జిల్లాల వివరాలను ఆన్‌లైన్‌లోనే సర్క్యూలేట్ చేసింది. 1974 ఏపీ జిల్లాల(ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభించింది.