కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం
1 min readపల్లెవెలుగువెబ్ : కిన్నెర వాయిద్యకారుడు కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం వరించింది. నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో 1951లో జన్మించిన ఆయన పూర్తి పేరు దర్శనం మొగులయ్య. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడిగా.. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చారు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. మొగులయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.