తగ్గిన బంగారం ధర
1 min readపల్లె వెలుగు వెబ్: ఆకాశాన్నంటిన బంగారం ధరలు.. నెమ్మదిగా నేలకు దిగుతున్నాయి. కరోన నేపథ్యంలో భారీగ పెరిగిన బంగారం ధరలు.. లాక్ డౌన్ అనంతరం దశల వారిగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఏకంగా 56 వేల వరకు 10 గ్రాముల బంగారం ధర ఎగబాకింది. ఈక్విటి మార్కెట్ల మీద ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లడం, లాక్ డౌన్ నేపథ్యంలో బంగారం మీద పెట్టుబడి సురక్షితమన్న నమ్మకంతో చాలా మంది బంగారం మీద పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. దీంతో బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా ఎగబాకాయి. దీంతో సగటు మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కానీ.. అంతర్జాతీయ పరిణామలు, కరోన భయాలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం మొదలు పెట్టాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 45 వేల వద్ద ఉంది. లాక్ డౌన్ సమయంలో ఉన్న ధరతో పోల్చుకుంటే.. దాదాపు 10 గ్రాముల బంగారం మీద 11 వేల వరకు తగ్గింది. ఇటీవల వరుసగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిరస్తోంది. ఈనేపథ్యంలో బంగారం కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.