పద్మభూషణ్ అవార్డు తిరస్కరించిన మాజీ ముఖ్యమంత్రి
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య తిరస్కరించారు. పద్మ అవార్డు గురించి తనకు తెలియదని, తనకు ఎవరూ చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ తనను ఆ పురస్కారానికి ఎంపిక చేసి ఉంటే.. దానిని తిరస్కరిస్తున్నా అని చెప్పారు. బుద్దదేవ్ తో పాటు సీపీఎం పార్టీ కూడ ఇదే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అవార్డులు తీసుకోవడం తమ పార్టీ విధానం కాదని సీపీఎం ట్విట్టర్ లో స్పష్టం చేసింది. తాము పనిచేసేది ప్రజల కోసమని, అవార్డుల కోసం కాదని తెలిపింది. గతంలో సీపీఎం సీనియర్ నేత ఈఎంఎస్ నంబూద్రిపాద్ కూడ ఇదే రీతిలో అవార్డును తిరస్కరించారని సీపీఎం తెలిపింది.