NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని..రైలు కిందపడి ఆత్మహత్య !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉద్యోగ నోటిఫికేషన్లు లేవన్న బాధతో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసున్నాడు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా బయ్యారు నివాసి అయిన ముత్యాల సాగర్ రెండున్నరేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థలో శిక్షణ తీసుకుంటున్నాడు. మంగళవారం తెల్లవారుఝామున ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మొబైల్ వాట్సాప్ స్టేటస్ లో నోటిఫికేషన్లు లేవు.. పిచ్చిలేస్తోంది. కేసీఆర్, కరోన కారణం అని ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ముత్యాల సాగర్ ఆత్మహత్య నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వం ఆస్పత్రి శవాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే సాగర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కాంగ్రెస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ నేతలతో పాటు పీడీఎస్యూ, ఎస్ఎఫ్​ఐ, ఎఐఎస్ఎఫ్​, బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బాధితుడి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

      

About Author