ఆ జిల్లాకు బాలయోగి పేరు పెట్టండి
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు బాలయోగి పేరు పెట్టాలని సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిసిందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లేదా పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డా.అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కోరారు. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు.