PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మురిసిన.. మువ్వెన్నల జెండా..

1 min read

విద్యార్థులు సామాజిక బాధ్యత  పెంపొందిం చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలి….

 ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్​,  రాయచోటి:  బుధవారం73 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వాడ వాడలా మూడురంగుల జాతీయ జెండా రెప రెపలాడింది.  విద్యార్థులు సామాజిక బాధ్యత  పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎన్ సి సి విద్యార్థులు చీఫ్ విప్ కు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా  విద్యార్థులనుద్దేశించి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ  రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరుగుచుండడం అభినందనీయమన్నారు. గ్రేడ్ 3 లో ఉన్న మున్సిపాలిటీని గ్రేడ్1 అప్ గ్రేడ్ చేయించి పట్టణంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ , పట్టణ సుందరీ కరణ పనులు  తదితర అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రాయచోటిని  అన్నమయ్య జిల్లా కేంద్రంగాను, రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారన్నారు.75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కలెక్టర్, ఎస్ పి తదితర జిల్లా అధికారులుతో కలసి జరుపుకుందామన్నారు.మత సామరస్యాలకు ప్రతీకగా, రోల్ మోడల్ గా నియోజక వర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు.యువత అన్ని రంగులతో పాటు రాజకేయాలలోనూ రాణించాలన్నారు.భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా సంస్కృతి, సాంప్రదాయాలును పెంపొందించాలని ఆయన విద్యార్థులుకు సూచించారు.నాడు నేడుతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేస్తామన్నారు. పి జి కేంద్రాన్ని 54 ఎకరాలలో ఏర్పాటు చేసి దానిని యూనివర్సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.  విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసిస్తూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ముఖ్యమైనదని, మంచి మార్గంలో పయనించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లో విద్యార్థులకు సుమారు 2000 నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ కుమార్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున అన్నమయ్య జిల్లా, రాయచోటి కేంద్రం గా ప్రకటన వెలువడటం ఆనందదాయకమని, జిల్లా సాధనకై విశేషమైన కృషి సలిపిన శ్రీకాంత్ రెడ్డి గారికి రాయచోటి నియోజకవర్గ ప్రజల అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి హేమలత మరియు బృందం,వైఎస్ ఆర్ సిపి నాయకులు ఆసీఫ్ అలీఖాన్, నవరంగ్ నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన ఎన్ సి సి విన్యాసాలు…

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ సి సి విద్యార్థులు చేపట్టిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విన్యాసాలుపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తిలకించి విద్యార్థులును అభినందించారు.

About Author