పారదర్శకంగా.. కొత్త జిల్లాల ఏర్పాటు : బి.వై. రామయ్య
1 min readజిల్లాల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య. గురువారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి , నగర డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రామయ్య మాట్లాడుతూ అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రజల తరుపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు మేయర్ బీవై రామయ్య.
అనంతరం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆ తరువాత శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు బెల్లం మహేశ్వర్ రెడ్డి, మద్దయ్య, తేర్నకల్ సురేందర్ రెడ్డి, కృష్ణరెడ్డి, రంగారెడ్డి, విజయకుమారి, ధనుంజయ ఆచారి, యూనూస్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.