మహేష్ బ్యాంక్ లో హ్యాకింగ్ కు కారణం ఏంటంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ లోని మహేష్ బ్యాంక్ లో హ్యాకింగ్ జరగడానికి బ్యాంక్ సర్వర్ లోపమే కారణమని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హ్యాకింగ్ కు గురైన రూ. 12.9 కోట్లు పలు ఖాతాలకు బదిలీ అయ్యాయని తెలిపారు. అందులో రూ. 3 కోట్లు నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. మహేష్ బ్యాంక్ కు సంబంధించిన మూడు ఖాతాల నుంచి దేశంలోని 120 వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ అయినట్టు సీపీ ఆనంద్ తెలిపారు. ప్రజల ఖాతాలతో వ్యవస్థ నడిపినప్పుడు సరైన భద్రత అవసరమని, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బ్యాంకు పైన కేసు నమోదు చేస్తామని చెప్పారు.