రాజంపేటలో ఆందోళనలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : కడప జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజంపేటను కాదని, రాయచోటిలో తమను కలపడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు రాస్తారోకోకు యత్నించాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. రాజకీయపార్టీల నేతలను కూడ అనుమతించలేదు.