నష్టాలకు విరామం.. లాభాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుస భారీ నష్టాలకు స్వల్ప విరామం ప్రకటించాయి. అంతర్జాతీయంగా సూచీలు మిశ్రమంగా కదులుతున్నాయి. అమెరికా ఫెడ్ మీటింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు భారీ నష్టాన్ని చవిచూసాయి. ఐటీ, మెటల్స్, రియాల్టీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కొనుగోళ్ల ఒత్తిడితో సూచీలు ఇంట్రాడే గరిష్ఠం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 760 పాయింట్ల లాభంతో 58037 వద్ద, నిప్టీ 249 పాయింట్ల లాభంతో 17359 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 38343 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.