యువత.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: బి.వై. రామయ్య
1 min readపల్లెవెలుగు వెబ్: సమాజం రకరకాలుగా వచ్చే అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య గారు పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని మారుతి మెగా సిటీ ఎదురుగా వైష్ణవి ఎంటర్ప్రైసెస్ అనే జూట్ బ్యాగుల (వస్ర్తా సంచుల) చిన్న తరహా పరిశ్రమను మేయర్ , మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బ్యాంకుల రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు గురించి మరియు మానవ మనుగడకే ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ ను కర్నూలు నగరంలో లేకుండా చేస్తున్న నగర పాలక సంస్థ చర్యలను తెలుసుకొని ప్రత్యామ్నాయంగా మారినా వస్త్ర సంచుల ఆవశ్యకతను గుర్తించి జూట్ బ్యాగుల చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసినా నిర్వాహకులు ఎం.హరినాథ్ ఎం. కుమార్ నాయుడులవి చాలా మంచి ఆలోచనలని కొనియాడారు.ఫలితంగా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, వ్యాపారస్థులకు, ప్రజలకు కూడా ఉపయేగపడుతుందని తెలిపారు.ఇదే తరహాలో యువత ఆలోచన చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదగాలని ఆకాంక్షించారు.ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని కోరారు.