కొత్త చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా అనంత నాగేశ్వరన్
1 min read
పల్లెవెలుగువెబ్ : బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా ప్రముఖ కన్సల్టెంట్, రచయిత, అకాడమీషియన్ అనంత నాగేశ్వరన్‌ను నియమించింది. ఇప్పటి వరకు సీఈఏగా కొనసాగుతున్న కే సుబ్రమనియన్ స్థానంలో నాగేశ్వరన్‌ను నియామకం చేపట్టింది. నాగేశ్వర్‌ను ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రకటన వెలువడింది. అయితే కొత్త సీఈవో పదవీ బాధ్యతలు వెంటనే తీసుకుని బడ్జెట్ తయారీలో చేయి వేస్తారా ? లేక తర్వాత రంగంలోకి దిగుతారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే సీఈఏగా నాగేశ్వర్ నియామకం పట్ల సోషల్ మీడియాలో సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది.