కేంద్రం కన్నడ గొంతు నొక్కుతోంది !
1 min readపల్లెవెలుగువెబ్ : కన్నడ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మండిపడ్డారు. కన్నడను అణగదొక్కే చర్యలు నిరంతరమయ్యాయని, సాంస్కృతికతను అణగదొక్కేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు సాక్ష్యం లభించిందన్నారు. కన్నడహృదయంపై కాలుపెట్టేలాంటి దుష్ట చర్యలను వ్యతిరేకించకుండా ఉండలేమన్నారు. సూర్యోదయానికి ముందు నుంచే ప్రారంభమై రాత్రి 11 దాకా 18 గంటలపాటు నిరంతరంగా కన్నడ కార్యక్రమాలు సాగిస్తున్న 101.3 ఎఫ్‌ఎం రెయిన్‌బో కన్నడ కామనబిల్లు రేడియో ప్రసారాలను గొంతుకోసేలాంటి చర్యలకు కేంద్రం సిద్ధమైందన్నారు. రెయిన్‌బో కన్నడ కామనబిల్లు కేవలం రేడియో వాహిని మాత్రమే కాదని కన్నడిగుల హృదయస్పందన అని, కన్నడ శక్తి అన్నారు. కేంద్రప్రభుత్వం కన్నడిగుల మనోభావాలపై చెలగాటమాడుతోందన్నారు.