ఉద్యోగుల పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశం !
1 min readపల్లెవెలుగువెబ్ : తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులను ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఈ మేరకు వారికి మెమోలు జారీ చేసింది. బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తెలిపింది. బిల్లులు ప్రాసెస్ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత విభాగాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో విఫలమైన వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.