మాల్యాల రైతు సంఘము అధ్యక్షుడిగా నక్కల వెంకటేశ్వర్లు
1 min readపల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం లోని మాల్యాల గ్రామ రైతు సంఘము అధ్యక్షుడి గా కుర్వ నక్కల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఆదివారం పోలీసుల సమక్షంలో జరిగిన రైతు సంఘము ఎన్నికల లో ఆయనను గ్రామ రైతు లు ఎన్నుకున్నారు.గతంలో అధ్యక్షుడు గా బాధ్యలు చేపట్టిన రంగస్వామి పదవీ కాలం జనవరి 17 న ముగిసింది. దీనితో నూతన అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల లో వైసీపీకి చెందిన రైతులు రెండు వర్గాలు గా విడిపోయాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ఒకవైపు, గ్రామ సర్పంచి వర్గం ఒకవైపు ఎన్నికలలో పాల్గొన్నారు. సర్పంచ్ బంధువులు దూదేకుల ఖాజా మొద్దీన్ ను , ఎమ్మెల్యే వర్గం నక్కల వెంకటేశ్వర్లు ను అధ్యక్షుడు గా పోటీలో నిలిపారు.ఖాజా మొద్దీన్ కు 22 మంది రైతులు చేతులు ఎత్తారు.నక్కల వెంకటేశ్వర్లు కు 54 మంది రైతులు చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. వెంకటేశ్వర్లుకు అత్యధిక ఓట్లు రావడంతో సర్పంచ్ వర్గం ఓటమిని అంగీకరించుకోలేక వాదనకు దిగారు. ఎన్నికలను వాయిదా వేయాలని పట్టుపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నందికొట్కూరు సిఐ నాగరాజ రావు ఇరువర్గాలతో మాట్లాడారు. సమస్యను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.సర్పంచ్ వర్గం ఎన్నికలను వాయిదా వేయాలని పట్టుబట్టారు.పోలీసులు ఇరువర్గాల పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇరువర్గాల రైతులను, గ్రామస్తులను అక్కడినుంచి పంపించారు.గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నందికొట్కూరు అర్బన్ ఎస్ ఐ వెంకటరెడ్డి, వెంకటరమణ ల ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.