లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readముంబయి: చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల బాటపట్టింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో.. ఇన్వెస్టర్ల కొనగోలుతో స్టాక్ మార్కెట్ కళకళలాడుతోంది. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ.. మంగళవారం గ్యాప్ అప్ తో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ 868 పాయింట్ల లాభంతో 49860 వద్ద, నిఫ్టీ 250 పాయింట్ల లాభంతో 14756 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 560 పాయింట్ల లాభంతో 33800 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఫార్మా రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఈ మూడు రంగాలు కూడ ఇండెక్స్ వెయిట్స్ లో కీలకమైనవి కావడంతో.. ఈ మూడు రంగాల్లోని కొనుగోళ్లు మార్కెట్లను లాభాల బాటలో నడిపిస్తున్నాయి.