కానిస్టేబుల్ బలవన్మరణం..
1 min readరంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా యాచారం మండల శివారులో కానిస్టేబుల్ మల్లికార్జున సైదులు(25) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే వివాహం అయిన సైదులు.. మర్రిగూడెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. పోయిన సంవత్సరం నవంబర్ లో సైదులుకు వివాహం అయింది. మర్రిగూడెంలోనే కాపురం ఉంటున్నాడు. నల్గొండ జిల్లా డిండి మండలం ఖానాపూర్ సైదులు స్వగ్రామం. భార్య భర్తల మధ్య మనస్పర్థులున్నట్టు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఇంటికెళ్లిన సైదులు.. భార్యతో గొడవపడి ఇంటినుంచి బయటికొచ్చేశాడు. అనంతరం స్థానిక తిరుమలేశుని గుట్టు సమీపంలో ఓ వెంచర్ లోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.