లక్షలో వంద తగ్గితే ఇబ్బందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగులకు లేదా? రాష్ట్ర ప్రజల సంక్షేమం మీకు అవసరం లేదా? అంటూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఉద్యోగుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. లక్ష జీతం వచ్చిన దగ్గర వంద రూపాయలు తగ్గితే ఉద్యోగులకు ఇబ్బందా? అంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. చర్చలకు రావాలని కోరినా రాకుండా సమ్మె చేస్తామనడం సరికాదన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం బేసిక్ ఎంత వస్తుందో చూసుకోకుండా ఆందోళనకు దిగడం విజ్ఞత కలిగిన ఉద్యోగులు ఆలోచించాలన్నారు.