60 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో 60 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పిఎం గతి శక్తి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుందని, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆమె అన్నారు. దేశంలో యువత, మహిళలు, పేదలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తిని సృష్టించే అవకాశం ఉందని నిర్మలాసీతారామన్ లోక్ సభలో వెల్లడించారు.