PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ చేనేత’ల ముద్రా రుణాల లక్ష్యం త్వరగా పూర్తి చేయాలి: జేసీ (ఆసరా)

1 min read
  • 2021-22 సంవత్సరానికి 1444 మంది చేనేత కార్మికులకు ముద్ర రుణాలు…

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: చేనేత కార్మికుల  ముద్రా రుణాల లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు చేనేత కార్మికులకు ముద్రా రుణాలు మంజూరుపై సంబంధిత అధికారులతో జూమ్ వి సి నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి గాను కర్నూలు జిల్లాలో 1444 మంది చేనేత కార్మికులకు ముద్రా రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.  ఇందుకు సంబంధించి బ్యాంకర్లు చేనేత మరియు జౌళి శాఖ వారు  లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయించాలన్నారు .జిల్లాలో 1444 మంది చేనేత కార్మికులకు ముద్రా రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యం కాగా  అందులో ఇప్పటివరకు కేవలం 60 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి చివరికల్లా ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రుణాలు మంజూరు చేసేందుకు ఎటువంటి సమస్యలు ఉన్నా చేనేత మరియు జౌళి శాఖ అధికారులు వారి సిబ్బంది ముద్రా రుణాలు లబ్ధిదారులతో సంప్రదించి సమస్యలు పరిష్కరించాలన్నారు. అర్హులైన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున ఎటువంటి సూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఇందులో పదివేల రూపాయలు సబ్సిడీ ఉంటుందన్నారు. కావున జిల్లాలో ముద్ర రుణాలకు అర్హులైన చేనేత కార్మికులు అందరూ రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎం వెంకటనారాయణ, చేనేత మరియు జౌళి శాఖ ఏడి హరికృష్ణ, బ్యాంకర్స్ తదితరులు పాల్గొన్నారు.

About Author