అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా ప్రకటించడం హర్షణీయం..
1 min readపల్లెవెలుగువెబ్, రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త జిల్లాల ప్రకటనలో భాగంగా అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా ప్రకటించడంపై మంగళవారం ముస్లిం మత పెద్దలు,మైనార్టీ నేతల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు స్థానిక టానా వద్దగల జామియా మసీదు ముందర హర్షం వ్యక్తం చేస్తూ థాంక్యూ..సీఎం సార్, థాంక్యూ..ఎంపీ మిథున్ రెడ్డి సార్,థాంక్యూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సార్ అంటూ నినాదాలు చేసి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అనాదిగా వెనుకబడి ఉండి,అన్ని ప్రాంతాలకు అనువుగా ఉన్న రాయచోటి ప్రాంతాన్ని ప్రణాళిక సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ప్రకటించడం హర్షణీయం,అభినందనీయమన్నారు.రాజంపేట పార్లమెంట్ లోని అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రం చేయడం ఈ ప్రాంత వాసులు చేసుకున్న పుణ్యఫలం అన్నారు. రాయచోటి ప్రాంత వాసులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పారు.ప్రభుత్వ నిర్ణయం సరైనదని అన్ని ప్రాంతాల వాసులు స్వాగతించాలని కోరారు.అలాగే ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ ఈనెల 4 వ తేదీన శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని వాన వద్ద నుండి ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృతజ్ఞతా ర్యాలీ ఉంటుందని తెలిపారు. కావున రాయచోటి ప్రాంతంలోని హిందూ ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్కాజి సర్ఫుద్దిన్ షా,మత పెద్దలు మహమ్మద్ గౌస్,వైసీపీ మైనార్టీ నేత హబీబుల్లా ఖాన్,జమియతే ఏ హింద్ శాఖ అధ్యక్షులు ఇలియాస్,ఖదీర్ ఖాన్,రాయచోటి జిల్లా సాధన సమితి సెక్రెటరీ ఇర్షాద్ అలీ ఖాన్,జమాలుల్లా భాష,మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష,జామియా మసీదు కమిటీ సభ్యులు హసన్ భాష,గౌస్ మొద్దిన్ ఖాన్,మహబూబ్ బాషా,మూసా కలీముల్లా,సహారా సంస్థ సభ్యులు అఫ్తాబ్, అమీర్,జిలాన్,సున్నీ,స్వీట్స్ ఇర్షాద్ తదితర మైనార్టీ నేతలు పాల్గొన్నారు.