PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతామణి నాటకాన్ని ఎలా నిషేధిస్తారు ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో చింతామణి నాటక నిషేధం పై ఏపీ హై కోర్టులో విచారణ జరిగింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దీని పై పిటిషన్ దాఖలు చేశారు. చింతామణి పుస్తకాన్ని నిషేధించనప్పుడు.. నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాటకంలో ఒక క్యారెక్టర్ బాగలేకపోతే మొత్తం ఎలా నిషేధిస్తారని అడిగింది. ప్రభుత్వానికి వచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా నిషేధించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ రిప్రజెంటేషన్ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. వచ్చే మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటు హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

         

About Author