ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో తెలిసి రావాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదంటారా ? అంటూ పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల వెనుక ఎవరో ఉన్నారని… వాళ్లే ఉద్యమం చేస్తున్నారని ఆరోపిస్తున్నారన్నారు. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారని స్పష్టం చేశారు. అర్థరాత్రి 12 గంటల వరకు సెక్రటేరీయేట్టులో వెయిట్ చేయించి అవమానం చేశారన్నారు. పోలీసుల వెనుక కూడా తామే ఉన్నామన్నారు. పీఆర్సీ ఈ విధంగా ప్రకటించడం చరిత్ర అని.. ఈ ఉద్యమం కూడా చరిత్రే అని చెప్పుకొచ్చారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ చేపడతామని.. ఏడు నుంచి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలని బొప్పరాజు పేర్కొన్నారు.