ఇక నుంచి ఆధార్ పే !
1 min readపల్లెవెలుగువెబ్ : బయోమెట్రిక్ మెషిన్ల ద్వారా ఆధార్ నంబరు ఆధారిత ఆర్థిక లావాదేవీలు చేసుకునే సౌకర్యాన్ని ఎంఓఎస్ యుటిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఆధార్ నంబరు ఆధారిత ఆర్థిక లావాదేవీలు చేసుకునే సౌకర్యాన్ని ఎంఓఎస్ యుటిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కల్పించింది. నగదురహిత విధానంలోకి మారే క్రమంలో ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఆధార్ నంబరు ఆధారిత ఆర్థిక లావాదేవీలకు ఆధార్ పే అనే పేరును పెట్టింది ఈ కంపెనీ. డిజిటల్ భారత్‌లోకి మారే క్రమంలో ఇది మరో కీలక అడుగుగా చెబుతున్నారు. ఇప్పటికైతే వెండర్ ‘ఆధార్ పే’ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే బ్యాంకు ఖాతాతో అనుసంధానితమైన ఆధార్ నంబరు మాత్రం వినియోగదారులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలని ఎంఓఎస్ పేర్కొంది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం వారు తమ యూనిక్ ఫింగర్ ఇంప్రెషన్‌ను వాడుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ తర్వాత బ్యాంకు నుంచి నగదు బదిలీ జరుగుతుంది.