దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి: మణికంఠ
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి/వీరబల్లి: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని నెహ్రు యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్ మణికంఠ పేర్కొన్నారు. గురువారం విఆర్డీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “ఆత్మ నిర్బర్ భారత్ “పై యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం కృషితో ఎదగడం, స్వయం సంవృద్ది సాధించడం ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యం అన్నారు. స్థానిక ఉత్పత్తులును ప్రపంచ వ్యాప్తంగా చేయడమే ప్రధాన ఉద్యేసమన్నారు.మండల అభివృద్ధి అధికారి మధు సూధన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మన దేశం ఇటీవల సాధించిన ఫలితాలే పునాదులుగా ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారని తెలిపారు. డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం అని తెలిసింది. విఆర్డీఎస్ సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉతేజన్ని ఇస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది రమణయ్య, చంద్ర శేఖర్,నెహ్రు యువకేంద్ర సిబ్బంది వెంకటేస్వర్లు, ప్రేమ కుమార్ పాల్గొన్నారు.