బీపీసీఎల్ ప్రైవేటీకరణ.. ఒక్కరే ముందుకొచ్చారు !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్ ప్రైవేటీకరణకు ఎంతో ప్రయత్నిస్తోంది. బీపీసీఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఏ ఒక్క బిడ్డర్ కూడా కంపెనీ కార్యాలయాలను సందర్శించలేదని బీపీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ వీఆర్కే గుప్తా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో తనుకున్న 52.98 శాతం వాటా మొత్తాన్ని అమ్మకానికి పెట్టింది. అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ సహా మూడు కంపెనీలు మాత్రమే ఆసక్తి చూపుతున్నాయి.