నెలాఖరుకు ఖాళీలన్నీ భర్తీ !
1 min readపల్లెవెలుగువెబ్ : వైద్య శాఖలోని అన్ని ఖాళీలను ఈ నెలాఖరుకు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వైఎ్‌సఆర్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణ ప్రగతిపై ఆరా తీశారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సృష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్నారు. డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో మార్పులు సృష్టంగా కనిపించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడపై దృష్టి పెట్టాలన్నారు. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. డాక్టర్లు గిరిజన ప్రాంతాల్లో ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని వెల్లడించారు. వారికి ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్న దానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే.. తప్పనిసరిగా ఆమోదిస్తామన్నారు.