ఓవైసీ పై దాడికి కొన్నాళ్లుగా ప్లాన్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పై దాడి చేసిన నిందితులు గత కొన్ని రోజులుగా ఆయనను వెంటాడారని పోలీసు దర్యాప్తులో తేలింది. సభలు, ర్యాలీల్లో అసదుద్దీన్ చేసిన ప్రసంగాలతో విసిగిపోయిన నిందితులు సచిన్, శుభంలు ఒవైసీపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితులు మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు హాజరై, దాడికి పథకం పన్నారని సమాచారం. ఒవైసీపై దాడి చేసిన నిందితులు మీరట్ ర్యాలీలో పాల్గొన్నారనే సమాచారంతో పోలీసులు ర్యాలీకి సంబంధించిన సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని వెంబడిస్తున్నారని, అయితే ఆయనపై దాడి చేసే అవకాశం రాలేదని పోలీసులు చెప్పారు.