నేరం నిరూపణ కాకుండా .. ఎంత మంది జైల్లో ఉన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య ఎంత ?. దీని పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఎంపీ డాక్టర్ వికాస్ మహాత్మే పార్లమెంట్ లో హోం మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి స్పందించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. జైలు గణాంకాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్వహిస్తుందని, వాటిని తన వార్షిక నివేదిక ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా’లో ప్రచురిస్తుందని పార్లమెంటులో సమాధానం సమర్పించింది. 2020, డిసెంబరు 31 నాటికి జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య చాలా అధికంగా ఉంది. భారతదేశం అంతటా 3,71,848 మంది అండర్‌ట్రయల్ ఖైదీలు ఉన్నారు. ఇందులో 28 రాష్ట్రాల్లో 3.52,495 మంది ఖైదీలు ఉండగా, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఖైదీల సంఖ్య 19,353గా ఉంది. భారతదేశంలో దాదాపు నాలుగున్నర లక్షల మంది ఇప్పటికీ దోషులుగా రుజువుకాకుండా జైళ్లలో ఉన్నట్లు ఈ డేటా తెలియజేస్తోంది.