రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి : ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గ్రామాల్లో రౌడీషీటర్లు ప్రవర్తనతో ఉండాలని ఎస్ఐ.జి మారుతి శంకర్ అన్నారు. వివిధ గ్రామాల్లో ఉన్న రౌడీషీటర్ లను పిలిపించి స్థానిక పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్లకు ఎస్సై అవగాహన కల్పించారు. గ్రామాల్లో చిన్నపాటి విషయానికి పెద్ద సమస్యగా చేసుకొని తగాదాలు చేసుకోవడం వలన మీపై కేసులు నమోదు అయితే మీ జీవితాలు నాశనం అవుతాయని మీపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయని మీరు మీ పనులను మీరు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడపాలని ఆయన అన్నారు. గ్రామాల్లో అలజడులు సృష్టిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని ఆయన అన్నారు. తర్వాత సాయంత్రం స్థానిక బస్టాండ్ కూడలిలో సిబ్బందితో కలిసి ఎస్ఐ వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అని మద్యం సేవించి వాహనాలను నడపరాదని ఆయన అన్నారు. సరైన పత్రాలు లేనందున పది వాహనదారులకు ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య సిబ్బంది కర్ణ,హిమాంస, సూర్య తదితరులు పాల్గొన్నారు.