పోషకాహారంతోనే… ఆరోగ్యం పదిలం..: డా.చంద్రిక
1 min read–డైటిషియన్, న్యూట్రిషియనిస్ట్ డా. శ్రీమతి జె. చంద్రిక
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: విటమిన్లు, ప్రొటిన్లతో కూడిన ఆహారాన్ని సమపాలలో తీసుకుంటే.. ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు డైటిషియన్, న్యూట్రిషియనిస్ట్ డా. శ్రీమతి జె. చంద్రిక. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. కొందరు యువత ఫాస్ట్ఫుడ్ తినడం ఆందోళన కలిగించే అంశమన్నారు. నగరంలోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ భవనంలో ఆదివారం ‘ జీవితంలో ఆహారం పాత్ర’ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. పౌండేషన్ సెక్రటరి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. పి. చంద్రశేఖర్ ఎండి,డీఎం., ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారంపై చర్చించారు. ఈ సందర్భంగా డైటిషియన్, న్యూట్రిషియనిస్ట్ డా. జె. చంద్రిక మాట్లాడుతూ మనిషి జీవన శైలిలో ఆహార నియమాలు పాటించకపోవడంతో అనారోగ్యంపాలై అవస్థలు పడుతున్నారన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, అందులోనూ సమతుల్యత పాటించాలన్నారు. జీర్ణక్రియకు ఇబ్బందిపెట్టే ఆహారం తీసుకోకూడదన్నారు. అనంతరం డైటిషియన్, న్యూట్రిషియనిస్ట్ డా. జె. చంద్రికను కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.