క్రిప్టో కరెన్సీ, డిజిటల్ రూపీ మధ్య వ్యత్యాసం ఇదే !
1 min readపల్లెవెలుగువెబ్ : 2023 ఆరంభంలో దేశంలో డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది. ఈ డిజిటల్ రూపీ మీద.. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ఉన్నట్టుగానే నోట్ల సంఖ్య ఉంటుందని పేరు అధికార వర్గాలు చెప్పాయి. ఏ మాత్రం మార్పులు చేయడానికి వీలు లేకుండా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపీని తీసుకువస్తుందని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ డిజిటల్ రూపీ చెల్లింపులకు ప్రభుత్వ హామీ (సావరిన్ గ్యారెంటీ) ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు జారీ చేస్తున్న క్రిప్టో కరెన్సీలకు, డిజిటల్ రూపీ మధ్య ప్రధాన వ్యత్యాసం ఇదేనని అధికార వర్గాలు చెప్పాయి.