కరోన.. అంత త్వరగా వదిలేది కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపోయేది కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని అన్నారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న సమూహాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్ సుదీర్ఘకాలం ప్రబలితే దాని ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. కామన్‌వెల్త్‌లోని జనాభాలో 42 శాతం మంది మాత్రమే టీకా రెండు డోసులు పొందగలిగినట్టు చెప్పారు. ఆఫ్రికన్ దేశాలు సగటున 23 శాతం వ్యాక్సినేషన్ రేటును సాధించినట్టు తెలిపారు.