వస్త్రధారణ ఆధారంగా బోధన అడ్డుకోవడం ఏంటి ?
1 min readపల్లెవెలుగువెబ్ : హిజాబ్ పై పార్లమెంట్ లో రగడ చోటు చేసుకుంది. ముఖాన్ని కప్పేసేలా ముస్లిం విద్యార్థినులు ధరిస్తున్న వస్త్రధారణను హిజాబ్ అంటారు. సోమవారం లోక్‌సభలో ఈ అంశాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన సభ్యులు ప్రస్తావించారు. విద్యార్థినుల వస్త్రధారణ ఆధారంగా బోధనను అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సర్కారు తీరు సరికాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ఉడుపి కళాశాలలో ప్రారంభమైన హిజాబ్ వివాదం రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించి ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. దీని వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఆరోపించారు.