కువైట్ లో భారత కార్మికుల సంఖ్య ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : గల్ఫ్ దేశం కువైట్ లో విదేశీ కార్మికులు అధికంగా ఉంటారు. వారిలో భారతీయ కార్మికుల సంఖ్య కూడ గణనీయంగా ఉంటుంది. తాజాగా వెలువడిన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం ఈజిప్ట్ శ్రామిక శక్తి భారతీయ, కువైత్ శ్రామిక శక్తిని అధిగమించి మొదటి స్థానం దక్కించుకుంది. 2021 సెప్టెంబరు వరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ గణాంకాలను రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం కువైత్ లేబర్ మార్కెట్‌లో మగ, ఆడ కార్మికులు కలిపి మొత్తం 4,56,600 మంది ఈజిప్టియన్లు ఉన్నారు. ఇది కువైత్ మొత్తం కార్మికుల సంఖ్య 1.9 మిలియన్లలో 24 శాతానికి సమానం. దీంతో భారత్, కువైత్ శ్రామిక శక్తిని వెనక్కి నెట్టి ఈజిప్ట్ మొదటి స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత భారత్ 4,51,300(23.7శాతం) మంది కార్మికులతో రెండో స్థానంలో నిలిచింది.