‘చింతామణి నాటకం’పై నిషేధం.. ఎత్తివేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ :రాష్ట్రప్రభుత్వం చింతామణి నాటకంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని,ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్.7 ను రద్దు చేయాలని దీనిపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసి పునరాలోచించాలి అంటూ…స్థానిక పత్తికొండ తహసీల్దార్ గారికి కర్నూలు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ,స్థానిక శ్రీ రాఘవ కళసమితి అధ్యక్షులు కాశప్ప,రంగస్థల నటులు నారాయణ,వర్మ,లక్మినారాయణ అనసూయమ్మ,ప్రజానాట్యమండలి నాయకులు కారన్న,వెంకటరాముడు,ఎంపీటీసీ సభ్యులు వీరన్న వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చాలామంది కళాకారులు ఈ నాటకం ద్వారా తమకుటుంబాలను పోషించుకుంటున్నారని ,అకస్మాత్తుగా ఈ నాటాకాన్ని రద్దు చేయడం వలన ,నాటక రంగాన్ని నమ్ము కొని జీవిస్తున్న వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదమున్నది ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారి పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విన్నవించారు.వంద సంవత్సరాల నుండి ఆడుతున్న ఈ నాటకాన్ని రద్దు చేయడంవలన కళాప్రియులు చాలా నిరాశకు గురిఅయ్యారు అని ఆయన అన్నారు.ఈ నాటకంపై ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించాలి తప్ప,పూర్తిస్థాయిలో నాటకాన్ని రద్దు చేయడమన్నది కళాకారులకు,నటులకు జీర్ణించుకోలేని విషయమన్నారు.ఈ కార్యక్రమంలో రంగస్థలనటులు హుస్సేని,రవికుమార్,సులేమాన్,మల్లికార్జున మరియు మoడ్లవేకటేశ్వర్లు పాల్గొన్నారు.