కోడికి బస్సు టికెట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ కోడిపుంజుకు కండక్టర్ టిక్కెట్ కొట్టాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏపీ 29 జడ్ 0518 నంబర్ ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం గోదావరిఖని నుంచి కరీంనగర్‌కు బయలుదేరింది. మహ్మద్ అలీ తన కోడిపుంజుతో సుల్తాన్‌బాద్‌లో బస్సు ఎక్కాడు. కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేశాడు. కాసేపటి తర్వాత అలీ సంచిలో కోడిపుంజును గుర్తించిన కండక్టర్ దానికి టిక్కెట్ తీసుకోవాలని సూచించాడు. కోడిపుంజుకు టిక్కెట్ ఏంటిని అలీ అతన్ని ప్రశ్నించాడు. కోడిపుంజైనా, మరే పెంపుడు జంతువైనా సరే బస్సులో ప్రయాణిస్తే టిక్కెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ తేల్చిచెప్పాడు. దీంతో అలీ కోడిపుంజుకు టిక్కెట్ కొనుగోలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.