NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీచర్ల పై సీఎస్ కు ఫిర్యాదు చేసిన జేఏసీ చైర్మెన్లు !

1 min read

పల్లెవెలుగువెబ్ : సీఎస్‌కు పీఆర్సీ సాధ‌న‌ సమితి జేఏసీ చైర్మన్స్ లేఖ రాశారు. తమపై కొందరు టీచర్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పీఆర్సీ సంబంధిత డిమాండ్లపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని, అప్పటి నుంచి తమపై కొందరు టీచర్లు దుష్ప్రచారం చేస్తున్నారని జేఏసీ చైర్మన్లు తెలిపారు. తమ కుటుంబస‌భ్యుల‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నారని, ఈ ఘటనలు తమ ప్రతిష్టని దెబ్బతీస్తున్నాయని జేఏసీ చైర్మన్లు చెప్పారు. అనంత‌పురం జిల్లా కురుభ‌వండ్లప‌ల్లికి చెందిన టీచ‌ర్లు.. న‌లుగురు జేఏసీ నేత‌ల‌ను వీధికుక్కల‌తో పోల్చారంటూ ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లే శ్రీకాకుళం, నెల్లూరు, క‌డ‌ప‌ జిల్లాల్లో జ‌రిగాయని, జేఏసీ చైర్మన్‌ల‌కు శ్రద్ధాంజ‌లి ఘటిస్తూ ఉన్న ఫొటోలను ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

        

About Author