ట్రాఫిక్ నియంత్రించడమే లక్ష్యం.. ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ బాబు
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: రాయచోటి పట్టణంలో డైట్ కాలేజి తదితర ప్రాంతాల్లో చాలా కాలంగా సమస్యాత్మకంగా ఉన్న చెత్త కుండీలను బుధవారం మునిసిపాలిటీ సిబ్బంది సహాయం తో తొలగించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ బాబు తెలిపారు. . అదేవిధంగా మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో కొన్ని సం., ల నుండి ఫుట్ పాత్ పై ఉన్నటువంటి టేబుల్స్ మరియు ఉపయోగం లో లేని షేడ్ లను తొలగించి ఫుట్ పాత్ పై ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇంకా ప్రజల కు సౌకర్యవంతముగా రాయచోటి ట్రాఫిక్ ను మార్చుటకు చేయవలసినది చాలా ఉన్నదన్నారు. అందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. రాయఛోటిలో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ద్విచక్రవాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.