సోషలిజాన్ని అంగీకరిస్తా : మోదీ !
1 min readపల్లెవెలుగువెబ్ : పేదలకు సేవ చేయడం, వారికి మౌలిక వసతులు కల్పించడమే సోషలిజం అయితే దాన్ని తాను అంగీకరిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బుధవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను సోషలిజాన్ని అంగీకరిస్తానని అయితే కుటుంబ-వారసత్వ రాజకీయాన్ని సమర్ధించనని అన్నారు. లోహియా, జార్జి ఫెర్నాండెజ్, నితీష్ కుమార్ లాంటి వారి సోషలిజాన్ని తాను సమర్ధిస్తానని అయితే సమాజ్‌వాదీ పార్టీ లాంటి కుటుంబ వారసత్వ రాజకీయాన్ని ఎంత మాత్రం అంగీకరించనని మోది అన్నారు.