PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొడుకు పుడతాడని.. తలలోకి మేకు !

1 min read

పల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ లో దారుణ ఘటన జరిగింది. తలలో మేకులు కొట్టుకుంటే కొడుకు పుడతారని ఒక మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మిన ఒక గర్భిణి.. తన తలలో మేకు కొట్టుకుని ఆసుపత్రి పాలయ్యింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిందీ ఘటన. గర్భిణి చాలా గాయపడిందని, మెదడు చాలా వరకు దెబ్బతిందని పెషావర్‌లో ఆమెకు వైద్యం చేసిన ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉందని అయితే ఎక్స్‌రే తీసి చూడగా ఐదు సెంటిమీటర్ల మేరకు తలలో మేకు దిగిందని, బలమైన ఆయుధంతో మేకును తన తలలోకి దింపుకుందని వైద్యులు పేర్కొన్నారు.

   

About Author