ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్సభలో ఎంపీ రఘరామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. 377 నిబంధన కింద లోక్సభలో ఆయన ప్రస్తావించారు. ఏపీలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ఏపీకి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని ఆయన అన్నారు.