PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మనం 1983 సేవా సంస్థ ’ సేవలు అభినందనీయం..

1 min read

– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ : రాయచోటి లోని  మనం 1983 సేవా సంస్థ సేవలు అభినందనీయమని  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  పేర్కొన్నారు.. మనం సేవా సంస్థ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన  ఫోర్స్ కంపెనీకి చెందిన పెద్ద  ఉచిత అంబులెన్స్ ఇన్ బిల్డ్ బాడీ ప్రీజర్ వాహనాన్ని జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,రాయఛోటి ప్రముఖ వైద్యులతో కలసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ  రాయచోటి పట్టణం, గ్రామీణ ప్రాంతాల లో నుంచి  వచ్చే పేద ప్రజల ఆరోగ్యపు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ 16 లక్షల వ్యయంతో  మూడవ అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.వెంటిలేటర్ వసతి ఉన్న ఈ అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన ప్రజలు ఈ అంబులెన్స్ సౌకర్యాలను వినియోగించు కోవాలన్నారు. మనం సంస్థ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి  పట్టణంలోని శుభ కార్య క్రమాలసమయాలలోనూ , గృహాల యందు  అవసరానికి మించి తయారు చేసిన భోజనాలును  భద్రంగా భద్ర పరచి  ఆకలిగన్న వారికి అందచేసే కార్యక్రమాన్ని విజయవంతంగా  నిర్వహిస్తున్నారన్నారు.పాలును, బట్టలను  కూడా  పేదలకు పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమన్నారు. ఆసుపత్రులకు వచ్చే బాలింతల సౌకర్యార్థం వేడినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పించారన్నారు. ప్రజల సౌకర్యార్థం మినరల్ వాటర్ ను కూడా అందచేస్తున్నారన్నారు.కంటి ఆపరేషన్లు, పేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం, కుట్టుమిషన్లు తదితర సౌకర్యాలు కల్పిస్తునున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు  నారాయణరెడ్డి,మహేశ్వర రాజు,భాస్కర్ రెడ్డి, రత్నం, ఖదీర్మనం సేవా సంస్థ అధ్యక్షుడు ప్రకాష్,అశోక్, శివ ప్రసాద్, అర్షద్, కాశీ అన్న, రమణారెడ్డి, భాస్కర్, వెంకటేశ్వర్లు, గోపాలరెడ్డి, మరియు ఇతర సభ్యులు ,మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష, సీనియర్ జర్నలిస్ట్ నాగిరెడ్డి, కౌన్సిలర్ పల్లా రమేష్, వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ నేత రెడ్డెప్ప రెడ్డి, బిసి నాయకుడు మల్లూరు రెడ్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author