PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనిల్ అంబానీ పై సెబీ నిషేధం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ పై సెబీ నిషేధం విధించింది. సెక్యురిటీ మార్కెట్లలో పాల్గొనకుండా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తో పాటు అనిల్ అంబానీ, మరో ముగ్గురి పై సెబీ నిషేధం విధించింది. ఈ కంపెనీలో మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారన్నది వీరిపై ఆరోపణ. అమిత్ బప్నా, రవీంద్ర సుధాకర్, పింకేశ్ ఆర్ షాలు నిషేధిత జాబితాలో ఉన్నారు. సెబీ వద్ద నమోదైన ఏ ఇంటర్మీడియరీతో కానీ, ఏ లిస్టెండ్ కంపెనీతో కానీ లేదా ఏ పబ్లిక్ కంపెనికి చెందిన డైరెక్టర్లు, ప్రమోటర్ల నుంచి కానీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ వ్యక్తులు నిధుల సమీకరణ చేపట్టరాదని సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో స్పష్టం చేసింది.

         

About Author